Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

Advertiesment
perni jayasudha

ఠాగూర్

, బుధవారం, 1 జనవరి 2025 (16:44 IST)
తమకు చెందిన గోదాముల్లో నిల్వవుంచిన రేషన్ బియ్యపు బస్తాల మాయం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ బుధవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో జయసుధ ఏ1గా ఉన్న విషయం తెల్సిందే. పైగా, ఈ కేసులో ఆమెను అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. అయితే, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. 
 
దీంతో విచారణకు రావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె న్యాయవాదులతో కలిసి కలిసి బందరు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణ సమయంలో జయసుధ తరపు న్యాయవాదులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆర్.పేట సీఐ ఏసుబాబు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే, జయసుధ మచిలీపట్నం మేయర్‌ కారులో పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ప్రభుత్వ వాహనంలో ఆమె విచారణకు రావడం చర్చనీయాంశమైంది. 
 
కొత్త సంవత్సరానికి 16 సార్లు స్వాగతం పలికిన దేశం 
 
ప్రపంచ దేశాలు 2025 కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నాయి! అన్నింటికంటే ముందు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవులు 2025కి స్వాగతం పలికాయి. భానుడి కిరణాలు మొదట పడే పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాలు మొదట కొత్త ఏడాది సంబరాలు జరుపుకుంటాయి. ఆఖరున హౌలాండ్ వంటి దీవులు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి.
 
ఒక్కో దేశం ఒక్కోసారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. ప్రపంచ దేశాల్లోని ప్రజలు 2025కు ఒకేసారి స్వాగతం పలకగలుగుతారు! కానీ వ్యోమగాములు మాత్రం 16 సార్లు కొత్త యేడాదికి స్వాగతం పలుకుతారు. అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28 వేల కిలోమీటర్లు తిరుగుతుంది.
 
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకు 28 వేల కిలోమీటర్లు తిరుగుతూ 90 నిమిషాల్లో భూమిచుట్టూ ఒక రౌండ్ పూర్తి చేసుకుంటుంది. అంటే 24 గంటల్లో భూమిచుట్టూ 16 సార్లు తిరుగుతుంది. అందుకే వ్యోమగాములకు కొత్త యేడాదికి 16సార్లు స్వాగతం పలికే అవకాశం ఉంటుంది. వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యోదయాన్ని, ప్రతి 45 నిమిషాలకు ఒకసారి సూర్యాస్తమయాన్ని చూస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సంవత్సరంలో బ్యాంక్ సెలవులు ఇవే...