రాష్ట్రవ్యాప్తంగా తాము చేయించిన సర్వేలో ప్రజల నుంచి కాస్త కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మొత్తం 17 లక్షల మంది నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణలో ఎక్కడా కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం కాలేదంటూ మాజీ సీఎం జగన్ వద్ద పలువురు ఎమ్మెల్యేలు చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకారంగా ప్రజలు మౌనంగా వుండి ముంచేసినట్లు అర్థమవుతుంది.
దీనిపై జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ... ప్రజల్లో మనకు 40 శాతం ఓటింగ్ వుంది. కనుక మనం నిత్యం ప్రజల మధ్యనే వుండాలి. వైసిపి కార్యకర్తలను తెదేపా ఇబ్బంది పెడుతోంది. ఇంకా పెట్టాలని చూస్తుంది. కనుక అందరం కలిసి ఎదుర్కోవాలి. ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలను నేను వెళ్లి పరామర్శిస్తానంటూ చెప్పినట్లు సమాచారం.