తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానున్న ప్రమాణ స్వీకారం వేడుకకు హాజరు కావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. అలాగే జనసేన పార్టీ అధినేత కె. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చినప్పుడు, భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ఆ రెండు రోజులు ఆయమ తన హోటల్ గదికే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితులు పునరావృత్తం కాకుండా పవన్ కల్యాణ్‌కు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఇక ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత కసరత్తు చేస్తున్నారు.
మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కేటాయించాలనే దానిపై చంద్రబాబు సోమవారం సుధీర్ఘమైన కసరత్తు చేశారు. ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రానికి తిరిగి చేరుకున్న చంద్రబాబు నాయుణ్ని.. సోమవారం పలువురు నేతలు కలిశారు. మంత్రిపదవులు ఆశిస్తున్న నేతలు ఆయన ఇంటివద్దకు క్యూ కట్టారు. దీంతో ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు ఇవ్వాలనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.