Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను అందుకు ఒప్పుకోను, ప్రభుత్వం తప్పటడుగు వేస్తోంది: పయ్యావుల కేశవ్

Advertiesment
Payyavula kesav
, మంగళవారం, 6 జులై 2021 (18:27 IST)
తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. ఆలయం వెలుపల మీడియాతో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ టిటిడి ధర్మకర్తల మండలి దేవాలయాన్ని కూడా పబ్లిక్ అకౌంట్ పరిధిలోక తీసుకురావాలని తీర్మానం చేసినట్లు తెలిసిందన్నారు.
 
గవర్నర్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్‌కి తమ ఆమోదాన్ని తెలిపితే సాధ్యం అవుతుందన్నారు. వ్యక్తిగతంగా తన అభిప్రాయం తిరుమల స్వయంప్రతిపత్తి కలిగిన సంస్ధగా ఉండాలన్నది భక్తుల ఆకాంక్ష అన్నారు. వందల కోట్ల మంది హిందువుల ఆకాంక్ష ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలనేది ప్రజల మనస్సులో ఉండే భావన ఉందన్నారు.
 
నందమూరి తారక రామారావు టిటిడిని ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా చేయాలని ఆలోచన చేశారని..ఒక మతానికి సంబంధించిన దేవాలయంను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఖచ్చితంగా మతంలో ప్రభుత్వ జోక్యం అనేది అనవసరమని, మతానికి సంబంధించిన వ్యవస్ధల పనితీరును సమీక్ష చేసుకోవడానికి మార్గదర్సకాలు ఇవ్వాలన్నారు.
 
మతం మీద పెత్తనానికో, మతంలో జోక్యానికో ప్రభుత్వాలు ప్రయత్నం చేయడం సరైన చర్య కాదన్నారు. సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా అనేక దాడులను ఎదుర్కొంటూ స్వతంత్రంగా సజీవంగా నిలబడిందని... టిటిడిపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆధీనంలో ఉండాలనే ఆలోచనను పిఎసి ఛైర్మన్ గాను, స్వామి భక్తుడిగాను విభేదిస్తున్నానన్నారు.
 
బోర్డు సభ్యులతో మాట్లాడి గవర్నర్‌కి మా ఆలోచనను తెలియజేస్తానన్నారు. స్వామివారి కనుసన్నల్లో నడుస్తున్న ఈ సంస్ధలో వేరొకరి పెత్తనం అవసరం లేదన్నారు పిఎసి ఛైర్మన్ పయ్యావుల కేశవ్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో అసాధారణ వృద్ధిని సాధించిన హైదరాబాద్‌