Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను చంద్రబాబుకు ఏకలవ్య శిష్యురాలిని... పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత

ఏపీ మంత్రివర్గ విస్తరణలో తనకు బెర్తు ఖరారు చేస్తారని గంపెడు ఆశలుపెట్టుకున్న ఎమ్మెల్యేల్లో విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే (రిజర్వుడ్) వెంగలపూడి అనిత ఒకరు. అయితే, గత ఆదివారం చంద్రబాబు చేపట్టిన

నేను చంద్రబాబుకు ఏకలవ్య శిష్యురాలిని... పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (17:04 IST)
ఏపీ మంత్రివర్గ విస్తరణలో తనకు బెర్తు ఖరారు చేస్తారని గంపెడు ఆశలుపెట్టుకున్న ఎమ్మెల్యేల్లో విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే (రిజర్వుడ్) వెంగలపూడి అనిత ఒకరు. అయితే, గత ఆదివారం చంద్రబాబు చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆమెకు మొండిచేయి చూపించారు. 
 
దీనిపై ఆమె స్పందించారు. మంత్రివర్గ విస్తరణలో చివరి వరకు తన పేరు పరిశీలనలో ఉండటం సంతోషమన్నారు. తాను ఎప్పటికీ పార్టీకి విధేయురాలినని, చంద్రబాబుకు ఏకలవ్య శిష్యురాలినని చెప్పుకొచ్చారు. 
 
తమ నియోజకవర్గానికి వచ్చిన మంత్రి పదవి చేజారిపోయిందని బాధపడుతున్న కార్యకర్తలను సముదాయిచడం కష్టమైన పని అంటూ ఆమె తనలోని అసంతృప్తిని వెళ్లగక్కారు. కాగా, మంత్రి పదవిని ఇవ్వలేక పోవడంతో అనితతో చంద్రబాబు మాట్లాడినట్లు వినికిడి. నిరాశ చెందొద్దని, అండగా ఉంటానని చంద్రబాబు అనితకు హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎడప్పాడికి చెక్.. అమ్మ టీవీ 24x7 త్వరలో ప్రారంభం.. జీ టీవీని ఓపీఎస్ కొనేశారా?