Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నేను-మనం-జనం'... పుస్త‌కం రాస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

విజ‌య‌వాడ ‌: కుంగ్ ఫూ, క‌రాటే పంచ్‌ల‌తో... పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అమితంగా అల‌గించే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్... మ‌రోసారి క‌లం ప‌ట్టారు. జ‌నసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 'నేను-మనం-జ

Advertiesment
pawan kalyan writing latest book nenu manam janam
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (16:09 IST)
విజ‌య‌వాడ ‌:  కుంగ్ ఫూ, క‌రాటే పంచ్‌ల‌తో... పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను అమితంగా అల‌గించే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్... మ‌రోసారి క‌లం ప‌ట్టారు. జ‌నసేన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 'నేను-మనం-జనం' అనే పుస్త‌కాన్ని రాస్తున్నారు. దీనికి... మార్పు కోసం యుద్ధం... అనే స‌బ్ టైటిల్ కూడా పెట్టారు. 
 
ఒక రకంగా ఇది జ‌న‌సేన పార్టీ పీఠిక‌, మ్యానిఫెస్టోలా ఉంటుంద‌ట‌. జ‌న‌సేన పార్టీ పెట్టటం వెనుక ఆయనకు ఉన్న ఉద్దేశ్యాన్ని, ప్రేరేపించిన పరిస్థితులను, చెయ్యాలనుకున్న కార్యక్రమాలను, సాధించాలనుకుంటున్న ఆశయాల్ని ప్రతిబింబించేదిగా ఉంటుంద‌ట‌. ఇంతకుముందు ప్రచురించిన 'ఇజమ్' పుస్తకం కంటే భిన్నంగా, సరళంగా, సూటిగా ఉండాలనే ప్రయత్నంతో ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ప్రచురిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ పుస్తకాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో జ‌న‌సేన పార్టీ ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కావేరి గొడవ... అటు కాకి ఇటు వాలట్లేదు... పెళ్లికూతురుకు నో వెహికల్... తనవాడికోసం నడిచింది...