స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా లాభాల్లోకి తీసుకువచ్చేందుకు తాము కమిటెడ్‌గా వున్నామని పవన్ అన్నారు.
గత వైసీపీ హయాంలో జగన్ స్టీల్ ప్లాట్ భూములను అమ్మాలని సలహా ఇచ్చారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు.
గతంలో ఈ అంశాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంటు వెనుక ఎంతోమంది త్యాగాలున్నాయని గుర్తు చేశారు. గతంలో కూడా భూములు అమ్మాలని ప్రభుత్వం సూచిస్తే కార్మికులు మమ్మల్ని సంప్రదించారని డిప్యూటీ సీఎం అన్నారు. విశాఖ నగరంలో వాయు కాలుష్యం నిర్థిష్ట ప్రమాణాలకు లోబడే ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదన్నారు.