Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పెషల్ స్టేటస్ ప్యాకేజీ గురించి చదివి చదివి సైట్ వచ్చేసింది.. అనంతలోనే జనసేన తొలి ఆఫీస్: పవన్

రాజకీయాలపై అనంత సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకిపారేశారు. ప్రస్తుత రాజకీయాలు, వ్యవస్థలపై మండిపడ్డారు. రాజకీయాలంటే.. ఒకరినొకరు తిట్టుకోవడం అని అందరూ అనుకుంటున్నారు. కాదు. రాజకీయాలంటే ఏంటో ప్రస్తుత నే

స్పెషల్ స్టేటస్ ప్యాకేజీ గురించి చదివి చదివి సైట్ వచ్చేసింది.. అనంతలోనే జనసేన తొలి ఆఫీస్: పవన్
, గురువారం, 10 నవంబరు 2016 (16:59 IST)
రాజకీయాలపై అనంత సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకిపారేశారు. ప్రస్తుత రాజకీయాలు, వ్యవస్థలపై మండిపడ్డారు. రాజకీయాలంటే.. ఒకరినొకరు తిట్టుకోవడం అని అందరూ అనుకుంటున్నారు. కాదు. రాజకీయాలంటే ఏంటో ప్రస్తుత నేతలు పుస్తకాలు చదివి తెలుసుకోవాలన్నారు. మన నేతలకు చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చాక పదవులపై మమకారం ఉంది కాదని, ప్రజా సమస్యలపై లేదని తెలిపారు.
 
తనకు శత్రువులంటూ ఎవ్వరూ లేదన్నారు. వైకాపా అధినేత జగన్ అన్నా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నా ఎవరితోనూ తనకు శత్రుత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే వారి ఆలోచనలు, పాలసీ పట్లే తనకు విబేధాలున్నట్లు వెల్లడించారు. అంతేకానీ ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఎవ్వరితోనూ శత్రుత్వం పెట్టుకోనని... కానీ ప్రజాపక్షాన నిలబడకపోతే, మాయమాటలు చెప్తే.. ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే.. జగన్‌కు, చంద్రబాబుకు శత్రువునే.. బలమైన శత్రువునే అంటూ పవన్ హెచ్చరించారు. తనకు పదవులు, డబ్బులు ఏవీ వొద్దు.. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని పవన్ నొక్కి చెప్పారు. రాజకీయాలతో అలసిపోయాం.. విసుగు వచ్చేసిందని పవన్ అన్నారు. 
 
అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో సీమాంధ్ర‌హ‌క్కుల చైత‌న్య సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కులాలకు అతీతంగా పోరాటం చేస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని.. అనంతపురం గురించి పూర్తిగా తెలుసుకున్నానని.. కరువు కారణంగా ఆడపడుచులు మానాన్ని అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని కరువు ప్రభావాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తానని తెలిపారు. స్పెషల్ స్టేటస్ ప్యాకేజీ గురించి చదివి చదివి కంటి సైట్ వచ్చేసిందని, ప్ర‌త్యేక హోదాను ఎందుకు నిర్ల‌క్ష్యం చేస్తున్నారని సభాముఖంగా కేంద్రాన్ని ప్రశ్నించారు.
 
మన సంపదని మన కష్టాన్ని బయటి వాళ్లకి ఇచ్చేసి మళ్లీ కొనుక్కుంటున్నామని.. 1970లో ఓ వ్యక్తి రాసిన పుస్తకం చదివానన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ఆటలు కట్టిపెట్టాలన్నారు. మంచితనంతో, ఆత్మగౌరవంతో ఆడుకోవద్దన్నారు. అందుకే త్వరలో తన పార్టీ ద్వారా కార్యకలాపాలు ప్రారంభిస్తానని తెలిపారు. ఇందులో భాగంగా తన తొలి జనసేన పార్టీ కార్యాలయం అనంతలోనే ప్రారంభిస్తానని తెలిపారు.

2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. నాకు ఓట్లు వేయ‌ండి.. వెయ్యకపోండి. మీరు నాకు అండ‌గా ఉన్నా లేక‌పోయినా నేను మీకు అండ‌గా ఉంటాను’ అని ప‌వ‌న్ అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుస్తానో తనకు తెలియదని.. ప్రజల మేలు కోసం ప్రతీదీ చేస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా... గెలిపిస్తారో లేదో మీ ఇష్టం... పవన్ కళ్యాణ్