అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా... గెలిపిస్తారో లేదో మీ ఇష్టం... పవన్ కళ్యాణ్
అనంతపురం: అనంతపురం కష్టాల గురించి తనకు తెలుసుననీ, అందువల్లనే జనసేన పార్టీ మొదటి కార్యాలయాన్ని ఇక్కడే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అలాగే 2019 ఎన్నికల్లో అనంతపురం శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. నన్ను గెల
అనంతపురం: అనంతపురం కష్టాల గురించి తనకు తెలుసుననీ, అందువల్లనే జనసేన పార్టీ మొదటి కార్యాలయాన్ని ఇక్కడే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అలాగే 2019 ఎన్నికల్లో అనంతపురం శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. నన్ను గెలిపిస్తారో లేదో మీ ఇష్టం. ఐతే నేను మాత్రం మీ వెంటే ఉంటానని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ..." కేంద్ర ప్యాకేజీలో కొత్త అంశాలు ఏమీ లేవు. మనకు ఇవ్వాల్సినవే ఇస్తున్నారు. ప్యాకేజీని అవమానపరచడం నా ఉద్దేశ్యం కాదు. అది కేవలం ఓ పేపర్ విమానం. వెంకయ్య, జైట్లీ చెప్పే లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయి. సమస్యలు వస్తే నిలబడే వ్యక్తిని కానీ పారిపోయేవాడిని కాదు. హోదాపై మాట్లాడేందుకు చాలా ఆలోచన చేశాను.
ఎన్నికల సమయంలో తీయటి మాటలు చెపుతారు. ఎన్నో హామీలు ఇస్తారు. ముగిసిన తర్వాత అర్థం కాని భాషలో మాట్లాడుతారు. మాటలతోనే వంచిస్తున్నారు. మోసం చేస్తున్నారు. యువతకు రావాల్సిన ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు. హోదా ఇస్తామని విషయాన్ని నాన్చవద్దు. మీరు నాన్చేకొద్దీ మేం మరీ గట్టిపడతాం. ప్రజల్లో కోపతాపాలు పెరిగే వరకూ వెళ్లొద్దు. దయచేసి ఆ పరిస్థితి తీసుకురావద్దు." అంటూ చెప్పారు.