Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పెషల్ స్టేటస్ పసరువేది కాదా..? కరువు జిల్లాలకు అమృతం చుక్కండి బాబూ: పవన్

ఓట్లు అడిగేటప్పుడు అర్థమయ్యే భాషలో మాట్లాడే నేతలు.. అధికారం వచ్చాక అందలం ఎక్కాక... స్పెషల్ ప్యాకేజీపై మాత్రం ఎందుకండీ అర్థం కాని భాషలో మాట్లాడుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఇవ్వని స్టే

Advertiesment
Pawan Kalyan
, గురువారం, 10 నవంబరు 2016 (16:36 IST)
ఓట్లు అడిగేటప్పుడు అర్థమయ్యే భాషలో మాట్లాడే నేతలు.. అధికారం వచ్చాక అందలం ఎక్కాక... స్పెషల్ ప్యాకేజీపై మాత్రం ఎందుకండీ అర్థం కాని భాషలో మాట్లాడుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఇవ్వని స్టేటస్‌తో సన్మానాలు చేయించుకునేవారు కొందరున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని ఉద్దేశించి పవన్ ఎద్దేవా చేశారు. 
 
అనంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. బ్లూ రంగు చొక్కాలో పవన్ వెరైటీగా కనిపించారు. ప్రసంగం ప్రారంభించేందుకు ముందు అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, ఆడపడుచులందరికీ పేరుపేరునా నమస్కరించారు. సరిహద్దులో పాకిస్థాన్ మన సైనికులపై దాడికి అనంతరం సభ పెట్టాలనుకోలేదని.. అందుకే ఇంత లేటుగా అనంతలో సభ పెట్టానని.. అమరవీరులకు సలాం కొట్టి పవన్ ప్రసంగం ప్రారంభించారు. 
 
అనంతపురం కరువు ప్రాంతమని.. ఇలాంటి జిల్లాకు అండగా ఉంటానని.. ఈ స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడడానికి ముందు చాలా ఆలోచించానని.. కేంద్ర నిపుణులు... ప్యాకేజీపై పెద్దలతో చర్చించాకే మీ ముందుకు వచ్చానన్నారు. ఎందుకంటే ఈ స్పెషల్ ప్యాకేజీ హార్వార్డ్ యూనివర్సిటీల్లో చదువుకున్న వారు రాసిన ప్యాకేజీ. అందుకే బాగా అర్థం చేసుకుని మీ ముందుకు వచ్చానన్నారు. 
 
మన దగ్గరకి ఓట్లడగడానికి వచ్చినప్పుడు రాజకీయనాయకులు చాలా సులువైన, సరళమైన భాష మాట్లాడుతారు. గెలిచిన తరువాత మనకి ఏదైనా ఇవ్వాల్సి వచ్చిన సమయంలో మాత్రం మనకు అర్థం కాని, నిరాశకు గురిచేసే భాష మాట్లాడుతారు. అందుకే బాగా ఆలోచించి దీనిపై మాట్లాడుతున్నాను. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పలువురు నిపుణులతో చర్చించి మీ ముందుకు వచ్చాను. 
 
పలువురు నిపుణులతో విశ్లేషించిన తరువాత ఈ ప్యాకేజీలో వారు కొత్తగా ఏమీ ఇవ్వలేదని నిర్ధారణకు వచ్చానని పవన్ చెప్పారు. ప్యాకేజీలో కొత్తగా ఏమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్యాకేజీ అద్భుతమన్నారు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవచ్చు. ఇవ్వని స్పెషల్ స్టేటస్‌కి హీరోలు అయిపోయినవారున్నారు. చట్టబద్దత లేని స్పెషల్ ప్యాకేజీకి సన్మానాలు చేయించుకున్నవారున్నారని వెంకయ్యను ఉద్దేశించి పవన్ తెలిపారు. 
 
ఏమన్నా అంటే స్పెషల్ స్టేటస్ పసరువేది కాదంటారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న మీకు స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం కావచ్చు, కానీ కరువు కోరల్లో చిక్కుకున్న జిల్లాల ప్రజలకు ఇది అమృతం చుక్క అనేది మర్చిపోకండంటూ పవన్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి అభివృద్ధికి శ్రీవారి నిధులా... పట్టణవాసుల్లో మిశ్రమ స్పందన