Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనవాణి - జనసేన : పల్నాడు ప్రజా సమస్యల పెట్టె

Advertiesment
jsp cadre balaji
, సోమవారం, 30 జనవరి 2023 (17:30 IST)
'జనవాణి - జనసేన భరోసా' కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ చెంతకు తీసుకొచ్చేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టిన జన సైనికుడు బాలాజీని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‌ప్రత్యేకంగా అభినందించారు. 
  
పల్నాడు ప్రాంతంలో పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి వాటిని పవన్ కళ్యాణ్‌కి అందజేసేందుకు 'పల్నాడు ప్రజా సమస్యల పెట్టె' పేరిట కార్యక్రమం చేపట్టనున్నారు. సొంత వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. 
 
జన సైనికుడు బాలాజీ ఆలోచన మెచ్చిన పవన్ కళ్యాణ్ అతనికి ప్రోత్సాహక నగదు, మొబైల్ ఫోన్ బహుకరించారు. అంతేకాకుండా ఆ కార్యకర్తతో ముచ్చటించి ప్రత్యేకంగా ఫోటోలు దిగి, అతడిలో ఉత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తోడేళ్లు గుమికూడుతున్నాయ్... మీ బిడ్డ సింహంలా ఒంటరిగా వస్తున్నాడు... సీఎం జగన్