Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాకినాడలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

Pawan kalyan

సెల్వి

, గురువారం, 15 ఆగస్టు 2024 (12:13 IST)
Pawan kalyan
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. 
 
దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు. వేలాది అమరుల త్యాగాల ద్వారా వచ్చిన స్వాతంత్ర్యం ఈరోజు వేడుకగా జరుపుకుంటున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. 
 
రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా క్షీణించాయన్నారు. శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటే గత ప్రభు త్వం ఋషికొండ ప్యాలెస్ లాంటి విలాస భవనాలను నిర్మించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగోలో 14,000 కేసులు, 524 మరణాలు.. ఎమెర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో