ఈ నెల 6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా కార్యకర్తల సమావేశాలు జరగనున్నాయి. 6వ తేదీన పాణ్యం, 7వ తేదీన కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల కార్యకర్తలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు.
పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా సమావేశమవుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా నుంచి ముందుగా మూడు నియోజకవర్గాల సమావేశాలను నిర్వహించనున్నారు.
కర్నూలు జిల్లాకు హైదరాబాద్ నగరం దగ్గరగా ఉండటంతో ఈ సమావేశాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కార్యకర్తలు కోరారు.
ఈ మేరకు సమావేశాలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యాయి. ఈ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో ముఖాముఖిగా సంభాషిస్తారు.