Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21 నెలల తర్వాత కనువిందు చేసిన పాపికొండల విహారయాత్ర

Advertiesment
21 నెలల తర్వాత కనువిందు చేసిన పాపికొండల విహారయాత్ర
, సోమవారం, 5 జులై 2021 (06:57 IST)
గోదావరిలో పాపికొండల విహారయాత్ర అనుభూతి మళ్లీ పర్యాటకులను కనువిందు చేసిసింది. 2019 సెప్టెంబరు 15న కచ్చులూరు వద్ద రాయల్‌వశిష్ట బోటు మునిగి 51 మంది చనిపోవడంతో అప్పటి నుంచి విహార యాత్రకు బ్రేక్‌ పడింది.

మళ్లీ ఇప్పుడు చాలా విరామం తర్వాత ఆదివారం నుంచి పాపికొండల యాత్రను పర్యాటకశాఖ పునఃప్రారంభించింది. ఉదయం 9 గంటలకు 91 సీట్ల సామర్థ్యం గల హరిత బోటు తొలి రోజు యాత్రకు బయలుదేరింది. అన్నిరకాల తనిఖీలు, జాగ్రత్తలతో ఇకపై ప్రతి రోజూ ఈ బోటు తిప్పనున్నారు.

గోదావరిలో అలా విహరిస్తూ పాపికొండల వరకు వెళ్లి రావడం అంటే అదొక అందమైన అనుభూతి. దేశవ్యాప్తంగా అనేక మంది గడచిన కొన్నేళ్లలో పాపికొండల షికారు కోసం వచ్చివెళ్లినవారే. అనూహ్యంగా 2019 సెప్టెంబర్‌ 15న పాపికొండల యాత్రకు బయలుదేరిన రాయల్‌వశిష్ట బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో 51 మంది దుర్మరణం పాలయ్యారు.

తిరిగి అప్పటి నుంచి ఇప్పటివరకు పాపికొండల యాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. వందలాది బోట్లు అప్పటి నుంచి మూలనపడ్డాయి. అయితే అనేక భద్రతల నడుమ ప్రభుత్వం కంట్రోల్‌రూంలు ఏర్పాటుచేసి పాపికొండల యాత్రకు బోట్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది.

అందులోభాగంగా నేటి నుంచి పర్యాటకశాఖ ప్రతి రోజూ బోట్లను తిప్పనుంది. ప్రయాణిలకు రద్దీ బట్టి రోజుకు ఒకటి లేదా రెండు బోట్లను నడపాలని నిర్ణయించింది. 21 నెలల విరామం తర్వాత నేడు పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పాపికొండల యాత్రకు బయలు దేరనుంది.

తొలిరోజు 41 సీట్ల సామర్థ్యం కలిగిన 'కాటన్‌' పేరు ఉన్న బోటును తిప్పాలని పర్యాటకశాఖ అధికారులు భావించారు. దీనికి జలవనరులశాఖ నుంచి రూట్‌పర్మిషన్‌ రాకపోవడంతో పక్కనపెట్టారు. దీని స్థానంలో 91 సీట్ల సామర్థ్యం కలిగిన హరిత బోటును సిద్ధంచేశారు.

కొవిడ్‌ నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా సగం మందినే అనుమతించనున్నారు. కాగా పాపికొండల యాత్ర పునఃప్రారంభానికి సూచికగా పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి ఈనెల 1న లాంఛనంగా బోటు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు అందుబాటులోకి తెచ్చారు.

పలువురు ప్రైవేటు ఏజంట్లకు కూడా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేయించే అవకాశం ఇచ్చారు. అయితే శనివారం రాత్రి నాటికి మొత్తం 15 మంది పర్యాటకులే టిక్కెట్‌లు బుక్‌ చేసుకున్నారు. ఒకపక్క కొవిడ్‌ ముప్పున్న నేపథ్యంలో పర్యాటకుల నుంచి పెద్దగా యాత్రకు స్పందన కనిపించలేదు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి డిమాండ్‌ లేదు. అయితే తొలిరోజు కాబట్టి పర్యాటకులు తక్కువగా ఉన్నా బోటు నడపాలని నిర్ణయించారు.

కాగా కచ్చులూరు ప్రమాదం నేపథ్యంలో ఇకపై పాపికొండలకు బయలుదేరే ముందు బోటులో కొత్తగా అన్నిరకాల సదుపాయాలు సిద్ధంచేశారు. సిబ్బందికి వాకీ టాకీలు, శాటిలైట్‌ ఫోన్లు, పూర్తి స్థాయిలో లైఫ్‌ జాకెట్లు సిద్ధం చేశారు.

బోటు బయలుదేరే ముందు ఇకపై ప్రతి రోజు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరులశాఖ, పోలీసుశాఖ, ఐటీడీఏపీవో తదితరులందరికీ సమాచారం ఇవ్వనున్నారు. ప్రతి పర్యాటకుడి వివరాలు పొందుపర్చనున్నారు.

దేవీపట్నం వద్ద కచ్చితంగా బోటును నిలిపి పోలీసులతో పూర్తి స్థాయి తనిఖీలు తప్పనిసరి చేశారు. ఆదివారం నాటి పర్యాటకానికి ఇప్పటికే పోలీసుశాఖకు సమాచారం చేరవేశారు. జిల్లా పర్యాటకశాఖ అధికారులు రెండు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌, జేసీలను కలిసి పాపికొండలకు బోటు తిప్పుతున్న విషయం వివరించారు.

అయితే అత్యంత జాగ్రత్తలతో బోటు నడపాలని వీరు సూచించారు. గోదావరిలో వరద పెరిగే పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వర్షాలు పడే సమయంలోను వరద ఏ చిన్నది పెరిగినా తక్షణం పర్యాటకం నిలిపివేయాలని ఇప్పటికే పర్యాటకశాఖకు జిల్లా అధికారులు స్పష్టం చేశారు.

పాపికొండల బోటు షికారు దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి మొదలు కానుంది. కచ్చులూరు ప్రమాదానికి ముందు సింగన్నపల్లి నుంచి బోట్లు మొదలయ్యేవి. పోలవరం నిర్మాణంతో సింగన్నపల్లి ప్రాంతం చాలావరకు ముంపునకు గురికావడం, లోతు కూడా పెరగడంతో ఇప్పుడు అక్కడి నుంచి యాత్ర రద్దుచేశారు.

బదులుగా పోశమ్మగండి నుంచి బోటు ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. అక్కడి నుంచి పూడిపల్లి, వీరవరంలంక, ఏ.వీరవరం, తొయ్యూరు, దేవీపట్నం, కొండమొదలుకు వెళ్తుంది. సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటలకు పాపికొండలకు చేరుతుంది.

అక్కడి నుంచి కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి వరకు వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు తిరుగు ప్రయాణం అవుతుంది. సా యంత్రం అయిదు గంటలకు తిరిగి పోశమ్మగండికి బోటు చేరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలం ఆలయంలో అర్థరాత్రి డ్రోన్ల చక్కర్లు..