Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోదాపై రాజీ లేదు... మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా : వైఎస్ జగన్

హైద‌రాబాద్: ప్రత్యేక హోదాపై తాను రాజీలేని పోరాటం చేస్తాన‌ని, అవ‌స‌ర‌మైతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్ర‌త్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌కు అన్ని ప్రయోజనాలు వస్తాయని వి

హోదాపై రాజీ లేదు... మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా : వైఎస్ జగన్
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (15:06 IST)
హైద‌రాబాద్:  ప్రత్యేక హోదాపై తాను రాజీలేని పోరాటం చేస్తాన‌ని, అవ‌స‌ర‌మైతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తార‌ని  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్ర‌త్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌కు అన్ని ప్రయోజనాలు వస్తాయని వివ‌రించారు. ప్రత్యేక హోదా వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులతో లైవ్ షో ద్వారా ఆయన ముఖాముఖి మాట్లాడారు. 
 
రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోవడం వల్ల 98 శాతంపైనే కంపెనీలు కోల్పోయామని చెప్పారు. 70 శాతం ఉత్పత్తి రంగం హైదరాబాద్‌లోనే ఉందన్నారు. ఇప్పుడున్న మౌలిక వసతులతో మనం పోటీ పడలేమని, ప్రత్యేక హోదా వస్తేనే అన్నీ వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక రాయితీలు వస్తాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు వస్తాయని తెలిపారు. 
 
విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీయిచ్చిందన్నారు. హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. హోదా ఇవ్వబోమన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు సిగ్గులేకుండా స్వాగతించారని ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటన మొత్తం చూస్తే ఎవరూ థ్యాంక్స్ చెప్పరని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డారని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్టు ఆఫీసుల్లోనే ఇకపై పాస్ పోర్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..