పోస్టు ఆఫీసుల్లోనే ఇకపై పాస్ పోర్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..
పాస్ పోర్టుల కోసం వేలు వేలు వెచ్చిస్తున్నారా..? కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఇలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఇక సులభంగా పాస్ పోర్టు పొందవచ్చు. ఎలాగంటే..? పోస్టు ఆఫీసుల్లోనే ఇకపై పాస్ పోర్ట
పాస్ పోర్టుల కోసం వేలు వేలు వెచ్చిస్తున్నారా..? కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఇలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఇక సులభంగా పాస్ పోర్టు పొందవచ్చు. ఎలాగంటే..? పోస్టు ఆఫీసుల్లోనే ఇకపై పాస్ పోర్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. పాస్ పోర్టుల కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో కొత్త మార్పులతో పాటు వినియోగదారులకు సులభంగా పాస్‌పోర్టులు లభించే విధానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే తపాలా శాఖ చర్యలు తీసుకుంటోంది.
దీని ప్రకారం పోస్టాఫీసుల్లో పాస్ పోర్ట్ దరఖాస్తులను పొందవచ్చు. ఆపై కచ్చితమైన ఆధారాలతో పూర్తి చేసి సమర్పించి పాస్ పోర్ట్ పొందవచ్చు. ఈ విధానం తొలుత ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. అలాగే దేశ వ్యాప్తంగా ఈ పద్ధతిని అమలు పరిచేందుకు భారత విదేశాంగ శాఖతో చర్చలు జరుగుతున్నాయని తపాలా శాఖాధికారులు తెలిపారు. మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకొచ్చారు. పాస్ పోర్టులను అందజేసేటప్పుడు తపాలా శాఖ స్పీడ్ పోస్టు విధానాన్ని అమలు చేస్తుందని చెప్పారు.