గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష.. ఎందుకో తెలుసా?
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలుశిక్ష పడింది. గుంటూరు కొత్తపేటలో ఓ వైద్యుడి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు మున్సిపల్ కమిషనర్ (జీఎంసీ)
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలుశిక్ష పడింది. గుంటూరు కొత్తపేటలో ఓ వైద్యుడి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు మున్సిపల్ కమిషనర్ (జీఎంసీ) ఎస్.నాగలక్ష్మిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలుశిక్ష విధించింది.
ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలం కావడమే కాకుండా, అక్రమనిర్మాణదారుతో కుమ్మక్కయి కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రమాణపత్రం దాఖలు చేయడమే కాకుండా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించారంటూ కమిషనర్‌కు నెల సాధారణ జైలు శిక్ష, రూ.రెండు వేల జరిమానా విధించింది.
అలాగే, జీఎంసీ నుంచి అనుమతి పొందకుండా నిర్మాణాలు చేపట్టినందుకు డాక్టర్ కె.వరప్రసాద్‌కు రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రూ రెండు వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లో జరిమానా సొమ్ము చెల్లించకపోతే మరో నెల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తీర్పుపై అప్పీలు దాఖలు చేసుకునేందుకు వారికి వెసులుబాటు కల్పిస్తూ తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపివేసింది.