ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారితో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటి వరకూ ఏపీలో కరోనాతో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కర్నూలులో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరింది. అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 74 కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో సగం కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోవే కావడం గమనార్హం. 24 గంటల వ్యవధిలో 45 కేసుల నమోదవ్వడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది.
తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 3న మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు మీడియా బులెటిన్‌లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.