Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ర‌మ్య కుటుంబానికి రూ.కోటి ఇచ్చే వ‌ర‌కు పోరాటం!

ర‌మ్య కుటుంబానికి రూ.కోటి ఇచ్చే వ‌ర‌కు పోరాటం!
విజయవాడ , మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:46 IST)
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం మృగాడి చేతిలో హత్యకు గురైన దళిత యువతి రమ్య కుటుంబానికి రూ. 10 లక్షలు ఇఛ్చి తప్పించుకోవాలనుకోవటం సరికాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ సిమెంట్ ప్యాక్టరీకి సిమెంట్ బస్తాల కవర్లు తయారు చేసే ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకై చనిపోయిన వారికి ఒక్కొక్కరికి కోటి ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వ చేత‌కాని, అసమర్ధ పాలన వల్ల ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ రూ. 10 లక్షలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తారా? ఇదెక్కడి న్యాయం ? ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రూ. కోటి ఇచ్చినట్టు రమ్య కుటుంబానికి ఎందుకు ఇవ్వరు? ఉన్నత చదువులు చదుకువుని ఉజ్వల భవిష్యత్ ఉన్న రమ్య ప్రాణాలు పోవటానికి కారణం మీ అసమర్ధ పాలన కాదా? మీ దిశ యాప్, సీసీ కెమెరాలు ఏమయ్యాయి? ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడన్న మాటలు అబద్దాలేనని, రమ్య హత్యతో తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ర్టంలో శాంతిభద్రతలు బాగున్నాయని మాట్లాడుతున్న సమయంలోనే గుంటూరులో రమ్య దారుణ హత్యకు గురైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయో ముఖ్యమంత్రి చెప్పాలి? అని ఘాటుగా విమ‌ర్శించారు.

రమ్య హత్య ఘటనకు సంబందించి సజ్జల రామకృష్ణారెడ్డి దళిత సంఘాలను పిలిపించుకుని వాళ్లను కన్వెన్స్ చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నార‌న్నారు. జగన్ దళిత వర్గాన్నిమోసం చేయటం మానుకోవాల‌ని, చేతికి అందొచ్చి తమ కుటుంబానికి అండగా ఉంటుదనుకున్న రమ్య మీ ప్రభుత్వ వైపల్యంతో ప్రాణాలు కోల్పోయింద‌ని ఆరోపించారు. రమ్య తల్లితండ్రులు వృద్ద్యాప్యంలో ఉన్నారు, వారికి ఆధారం ఎవరు? రమ్య కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల సాగుభూమి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఇవన్నీ ఇవ్వకపోతే జగన్ దళితులకు అన్యాయం చేసినట్టే అన్నారు.

సజ్జల దగ్గర వెళ్తున్న దళిత సంఘాలు సజ్జల మాయమాటలు వినిమోసపోవద్దు. ఎన్నో కోట్లు దుబారా చేసిన ప్రభుత్వం రమ్య కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వలేదా? రమ్య కుటుంబానికి రూ. 1 కోటి ఇవ్వకపోతే రాష్ర్టంలోని దళితులమంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తామని వర్ల రామయ్య హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాలిబన్లు ముమ్మాటికీ ఉగ్రవాదులే : నిషేధించిన ఫేస్‌బుక్