కాలు జారింది.. అంతే ఆ వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. వృద్ధాప్యంలో కూడా ఒకరిపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడి ఎంతో ధైర్యంగా బతుకుతున్న వృద్ధ దంపతుల పట్టుదలను చూసి విధి ఓర్వలేక పోయింది. చివరికి నీటి ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడి వృద్ధ భార్యాభర్తలిద్దరూ మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇట్నేవారి పల్లె గ్రామానికి సమీపంలో ఉన్న వేరుశనగ పంటకు కాపలాగా ఉన్నారు వృద్ధ దంపతులు నారాయణ వెంకట రామనమ్మ . వేరుశనగ పంటకి దగ్గరలో ఒక నీటి గుంట ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు వృద్ధ దంపతులు బట్టలు ఉతికేందుకు నీటి గుంట దగ్గరికి వెళ్ళారు.
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలుజారి ఇద్దరు దంపతులు నీటి గుంటలో పడిపోయారు. చివరికి ఎవరు అటువైపుగా గమనించక పోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.