Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2019లో అధికారం మాదే.. ప్రతి ఒక్కర్నీ మరిచిపోను : వైసీపీ ఎమ్మెల్యే

అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు వైకాపా ఎమ్మెల్యే ఒకరు గట్టివార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. నూజివీడు ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నివేశనా స్థలాల్లో ఇప్పుడు టీడ

Advertiesment
2019లో అధికారం మాదే.. ప్రతి ఒక్కర్నీ మరిచిపోను : వైసీపీ ఎమ్మెల్యే
, శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (16:37 IST)
అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు వైకాపా ఎమ్మెల్యే ఒకరు గట్టివార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. నూజివీడు ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నివేశనా స్థలాల్లో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ స్కీమ్‌లో జీ ఫ్లస్‌-3 నిర్మాణాలు చేపట్టిందని, దీంతో తమకు అన్యాయం జరుగుతుండటంతో లబ్ధిదారులు హైకోర్టుకు వెళ్లి స్టేటస్‌ కో తెచ్చుకుకున్నారు. అయినా మున్సిపల్‌ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరించి జీ ఫ్లస్‌-3 నిర్మాణాలను చేపట్టారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుచరులతో కలిసి రహదారిపై బైఠాయించారు. దీంతో నూజివీడు తహసీల్దార్‌ విక్టర్‌బాబు, సీఐ రామ్‌కుమార్‌, రూరల్‌ ఎస్.ఐ చిరంజీవి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ప్రభుత్వం మాదే, ప్రస్తుత సంఘటనల్లో ఎవర్నీ మర్చిపోను.. ఏమనుకుంటున్నారో అంటూ హెచ్చరించారు.  పేదలకిచ్చిన నివేశనా స్థలాల్లో జీ ఫ్లస్‌-3 నిర్మాణాలు చేపట్టడం తగదంటూ ఆయన కోరారు. ఓడిపోయిన వారిని ఇక్కడ అందలమెక్కిస్తారా? ఏమను కుంటున్నారు? కోర్టు ఆదేశాలను అమలు చేయాలని మూడు రోజులుగా కమిషనర్‌, టీపీవోలకు చెబుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈరోజు కూడా పనులు నిర్వహించడానికి ప్రయత్నించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ డాక్టర్‌ను డిన్నర్‌కు పిలిపించి.. డ్యూటీ రూమ్ తలుపులేసి?