Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఇద్దరు నేతలు కాదు - మహానుభావులు : జీవీఎల్‌కు పురంధేశ్వరి కౌంటర్

gvl - purandheswari
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దివంగత మహానేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె కౌంటర్ ఇచ్చారు. 
 
"అన్నీ ఇద్దరి పేర్లేనా" అంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన పురంధేశ్వరి.. "ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం, 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు, ఆరోగ్యశ్రీ అందించారు" అంటూ ట్వీట్ చేశారు. పైగా "ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు" అని మరో ట్వీట్ చేశారు. 
 
రాష్ట్రంలో చాలాకాలంగా అన్నింటికీ ఆ ఇద్దరి పేర్లే కనిపిస్తున్నాయంటూ పరోక్షంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయాలు కేవలం రెండు పార్టీలకో కుటుంబాలకే పరిమితంకాదన్నారు. ఏది చూసినా ఆ కుటుంబం లేదా ఈ కుటుంబం, ఆ పార్టీ, ఈ పార్టీ, అన్నీ ఇద్దరి పేర్లేనా, మిగతా నాయకులెవరూ కనిపించలేదా? అంటూ జీవీఎల్ ప్రశ్నించగా, ఈ వ్యాఖ్యలకు పురంధేశ్వరి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యావంతురాలైన మహిళ పురుషుడికి దగ్గరైతే అది బలవంత చేసినట్టు ఎలా అవుతుంది?