Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక.. పురుషులకూ గర్భనిరోధక మాత్రలు...

Advertiesment
corona tablet
, గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:45 IST)
మహిళల మాదిరిగానే పురుషులకు కూడా గర్భనిరోధక మాత్రలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఎలుకలపై ప్రయోగదశలో ఈ మాత్రలు ఉన్నాయి. ఎలుకలపై జరుపుతున్న ప్రయోగాలు విజయవంతమైతే ఆ తర్వాత పురుషులపై కూడా ఈ ప్రయోగం చేస్తారు. ఆ తర్వాత వీటిని అందుబాటులోకి తెస్తారు. 
 
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన వెయిల్ కార్నెల్ మెడికల్ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ఒక నివేదిక నేచురల్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ఈ నెల 14వ తేదీన ప్రచురితమైంది. 
 
కాగా, ఈ మాత్రలు తీసుకున్న తర్వాత మూడు గంట నుంచి 24 గంటల వరకు పని చేస్తుందని, ఈ మాత్రలను తీసుకోవడం వల్ల పురుషుడి శరీరంలోని ఏ ఒక్క హార్మోన్‌కు హాని చేయదని వెల్లడించింది. ఈ మాత్రను సింగిల్ డోస్ ఇవ్వడం వల్ల ఎలుకల్లో తాత్కాలిక సంతాన లేమి స్థితిని కలిగించడం సాధ్యమైందని వైద్యులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చబొట్లు వేయించుకునేందుకు పనికిరాని శరీర భాగాలు ఏవి?