Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.5 లక్షలిస్తే మీ అమ్మాయితో సంసారం చేస్తా... ఎన్ఆర్ఐ అల్లుడి బాగోతం...

అమెరికా సంబంధం.. మంచి ఉద్యోగం. దీంతో ఎన్ఆర్ఐ యువకుడికి ఇచ్చి పెళ్ళి చేస్తే కూతురు సుఖపడుతుందని అనుకున్నారు. ఇక ఏ కష్టాలు ఉండవనుకున్నారు. కానీ కూతురును ఓ ఇంటికి పంపించిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నరకం చూస్తున్నారు. కుమార్తెను అల్లుడి పెట్టే చిత్రహింసలు

Advertiesment
NRI son-in-law
, శనివారం, 31 మార్చి 2018 (14:22 IST)
అమెరికా సంబంధం.. మంచి ఉద్యోగం. దీంతో ఎన్ఆర్ఐ యువకుడికి ఇచ్చి పెళ్ళి చేస్తే కూతురు సుఖపడుతుందని అనుకున్నారు. ఇక ఏ కష్టాలు ఉండవనుకున్నారు. కానీ కూతురును ఓ ఇంటికి పంపించిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు నరకం చూస్తున్నారు. కుమార్తెను అల్లుడి పెట్టే చిత్రహింసలు చూసి తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. కూతురికి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.
 
తిరుపతి పద్మావతిపురంకు చెందిన అయ్యవారయ్య, గిరిజా కుమారి దంపతుల కుమార్తె అనిత. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసులుకు ఇచ్చి 2008 సంవత్సరంలో ఘనంగా పెళ్ళి చేశారు. వీరి స్వస్థలం కడప జిల్లా బద్వేలు. ఇటీవల బ్యాంకు మేనేజర్‌గా అయ్యవారయ్య పదవీ విరమణ పొందాడు. ప్రొద్దుటూరులో అనిత, శ్రీనివాసుల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. 
 
అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చారు. పెళ్ళి అనంతరం భార్య అనితను అమెరికాకు తీసుకెళ్ళాడు శ్రీనివాసులు. పెళ్ళయిన నెలరోజులకే భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కోసం చిత్రహింసలకు గురిచేశాడు. కట్నం ఇస్తేనే మీ కూతురితో సంసారం చేస్తానంటూ బెదిరించాడు. శ్రీనివాసులు టార్చర్ తట్టుకోలేక అనిత రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10 యేళ్ళ నుంచి అల్లుడి టార్చర్‌ను భరిస్తూనే వస్తున్నారు. అడిగినంత డబ్బులను శ్రీనివాసులకు ఇస్తూనే వచ్చారు.
 
అయినా సరే శ్రీనివాసులు మాత్రం వెనక్కి తగ్గలేదు. నెలకోసారి డబ్బులు కావాలంటూ అనిత తల్లిదండ్రులను వేధింపులకు గురిచేశాడు. దీంతో అనిత తల్లిదండ్రులు అమెరికా నుంచి ఆమెను ఇండియాకు తీసుకొచ్చి పోలీసులను ఆశ్రయించారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు భారతీయ మంత్రిత్వ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగి తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు అనిత తల్లిదండ్రులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్ పార్టీలో చేరేది లేదు.. అవన్నీ మీడియా కథనాలే: జేడీ