Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాడేపల్లి ప్యాలెస్ నియంత జగన్ నుంచి ప్రజలకు విముక్తి!! అందుబాటులోకి రోడ్డుమార్గం!

tadepalli house

వరుణ్

, సోమవారం, 17 జూన్ 2024 (11:11 IST)
ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్న తాడేపల్లి ప్యాలెస్ ముందు రహదారి నుంచి ప్రజలకు విముక్తి లభించింది. ఈ రహదారిని సాధారణ ప్రజలు వినియోగించకుండా గత ఐదేళ్ళుగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులు ఏకంగా 15 కిలోమీటర్ల మేరకు చుట్టుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చేంది. ఇపుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఈ రహదారిలో ఉన్న ఆంక్షలను తొలగించింది. దీనిపై టీడీపీ ఓ ట్వీట్ చేసింది. 
 
"తాడేపల్లి ప్యాలెస్ నియంత జగన్ రెడ్డి ఆక్రమించుకున్న రోడ్డు నుంచి, ప్రజలకు విముక్తి లభించింది. ప్రజలు వాడుకోవలసిన రోడ్డుని, ఆక్రమించి... తన ప్యాలెస్ ముందు పేదలు ఉండటానికి వీలు లేదని, జగన్ రెడ్డి వాళ్ళ ఇళ్లు తీసేయించాడు. అంతేకాదు, అక్కడే ఉన్న తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించాడు. తన ఇంటి ముందు ఉన్న రోడ్డు తన కోసమే ఉపయోగించాలని, ప్రజలు వాళ్ళ చావు వాళ్ళు చావాలని ఆదేశాలు ఇచ్చాడు.
 
ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, ఈ విలాస పురుషుడి నుంచి ప్రజలకు విముక్తి లభించింది. తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆంక్షలు తొలగిపోయాయి. విద్యార్థులు, రైతులు, కూలీలకు రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు, తాడేపల్లి ప్యాలెస్ చూసి షాక్ తింటున్నారు. రోడ్డు ఆక్రమించి జగన్ తన ప్యాలెస్ కోసం కట్టిన కట్టడాలు, తన ఇంటి చుట్టూ 30 అడుగుల ఎత్తులో కట్టిన ఐరన్ ఫెన్సింగ్ చూసి, జగన్ మనస్తత్వం గురించి చర్చించుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు... నలుగురి మృతి?