కరోనా మూలంగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి ఈ రోజుకు 42 రోజులు అయింది. మే 3 తరువాత కూడా భక్తులను దర్శనానికి అనుమతి అంశంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆదేశాలు మేరకు నిర్ణయం తీసుకుంటాం అని ఇఓ సింఘాల్ మీడియాకు తెలియజేశారు.
పద్మావతి అమ్మవారికి నిర్వహించే పరిణయోత్సవాలు తాత్కాలికంగా వాయిదా వేస్తూన్నాం అని,
ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని అనుకున్నా 80 మంది సిబ్బంది అవసరమవుతారు.
సామాజిక దూరం పాటించే అవకాశం లేకపోవడంతో ఆగమ పండితులు సూచన మేరకు వాయిదా వేస్తూన్నాం అన్నారు.
శార్వారి నామ సంవత్సరంలో ఎప్పుడైనా నిర్వహించే అవకాశం వుండటంతో నారాయణ గిరి ఉద్యాన వనంలోనే ఉత్సవాలును నిర్వహిస్తాం అని తెలియజేశారు ఇఓ సింఘాల్.