Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెర వెనుక కెమెరా మెన్ల కష్టాన్ని ఎవరూ గుర్తించరూ: కెమెరా మెన్ సాయి ఆవేదన

తెర వెనుక కెమెరా మెన్ల కష్టాన్ని ఎవరూ గుర్తించరూ: కెమెరా మెన్ సాయి ఆవేదన
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (11:55 IST)
తణుకు: ప్రతి షోలో తెర వెనుక కెమెరామెన్లు పడే కష్టాన్ని ఎవరూ గుర్తించరని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన శ్రీ సాయి క్రియేషన్స్ అధినేత,ప్రముఖ కెమెరామెన్ డి.జి.ఎం.ఎన్. సాయి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు లోని డి.సాయి స్కూల్ ఆవరణలో ఇటీవల ఈ టీవీ.నిర్వహించిన "ఢీ13"ప్రోగ్రామ్ లో కెమెరా మెన్ల జీవన విధానాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించడానికీ కారకులైన డాన్స్ మాస్టర్ మాస్టర్ ఆకుల సాయి,కంటిస్టెంట్ బడపు సాయి,రచయిత విప్పర్తి నానిబాబులను ఆయన సత్కరించారు.

సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కెమెరామెన్ల కష్టం అనంతం, ప్రతి దృశ్యాలను తీయించుకునే వారికి నచ్చే వరకు తీస్తూ ఉండాలన్నారు. భోజనం చేస్తే కొద్ది సేపటికే అరిగిపోతుందేమోగానీ చిత్రీకరించిన దృశ్యాలను మళ్లీమళ్లీ గుర్తు చేసేదే కెమెరా మెన్ అన్నారు.

కెమెరామెన్లకు ఉన్న ఓర్పు మరే రంగంలో ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదేమోనన్నారు. భూత,వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో జరిగిన, జరుగుతున్న, జర్నగబోతున్న సంఘటనలను దృశ్య రూపాల్లో చూపించాలంటే అది కెమెరామెన్లకే సాధ్యమన్నారు. కెమెరామెన్లు ధనిక,పేద అనే భేదం లేదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ : రాష్ట్రపతి ఉత్తర్వులు