Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో 7, 8 తేదీల్లో సెలవులు.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో 7, 8 తేదీల్లో సెలవులు.. ఎందుకో తెలుసా?
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 7, 8 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి కారణం ఈ నెల 8వ తేదీన పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తుండటమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. 
 
ఈ నెల 8వ తేదీతో పాటు, 7వ తేదీన కూడా సెలవుగా పేర్కొంది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సంస్థలకు, దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాగా, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండ్రోజులు ముందుగానే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
 
మరోవైపు, ఈ ఎన్నికలను వాయిదావేయాలని కోరుతూ జనసేన, బీజేపీలతో పాటు.. తెలుగుదేశం పార్టీల హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పటికే వాదనలు పూర్తికాగా, మంగళవారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ