Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు నివాస మార్గంలో వెలగని వీధిదీపాలు..

చంద్రబాబు నివాస మార్గంలో వెలగని వీధిదీపాలు..
, ఆదివారం, 15 డిశెంబరు 2019 (14:34 IST)
తెల్లవారుజాముకి ముందు నుంచే అంటే అర్ధరాత్రి 2 :30 గంటల తరువాత నుంచే పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లే ప్రధాన రహదారి అది.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నివాసం ఉండే మార్గం ఆ దారి..సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి అత్యంత చెరవులో ఉన్న గ్రామాలు..నిత్యం ఎంతోమంది మహిళలు, పెద్దలు, యువత వాకింగ్, జాకింగ్ రన్నింగ్ చేసే ఆహ్లదకర వాతావరణం ఉన్న ప్రాంతం. అనంత పద్మ నాభ స్వామి కొలువుదీరి ఉన్న గ్రామమైన ఉండవల్లి గ్రామంలో పంట పొలాల్లోకి, చంద్రబాబు నివాసానికి వెళ్ళే రహదారి చిమ్మ చీకట్లకు నెలవుగా మారింది.
 
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి వీధి దీపాలు వెలుగుతూ ఆరిపోతూ చీకట్లుకు స్నేహంగా మారింది.. వేకువజామున పూలు కోసేందుకు వెళ్లే రైతులు,, వ్యవసాయ కూలీలైన మహిళలు, పంట పొలాల నడుమ కాలుష్య రహిత వాతావరణంలో వాకింగ్ చేసుకునేందుకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. వెలుగుతూ ఆరిపోతూ, సక్రమంగా వెలగకుండా చీకటిని పరిచయం చేస్తున్నాయి.. పంట పొలాలు కావటంతో విష పురుగులు సంచరిస్తూ ఉంటాయని చీకట్లో ఏమి కనిపించటం లేదని, దీనితో భయపడుతూ ప్రయాణించాల్సి వస్తుందని రైతులు, వ్యవసాయ కూలీకి వెళ్లే మహిళలు,,వాకింగ్ కి వచ్చే వారు వ్యాఖ్యానిస్తున్నారు.. గత కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి ఉన్న అధికారులు ఎవరు స్పందించడం లేదని వాపోతున్నారు.. తక్షణమే స్పందించి మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
పెనుమాక మార్గం కూడా..
 మేము నిత్యం పంట పొలాల్లో పనులకు వెళ్లాలి,, అలాగే వేకువజామున వాకింగ్ చేసుకునేందుకు వెళ్తుంటాం.. మా వీధి దీపాలు కూడా సక్రమంగా వెలగటం లేదు.. చీకట్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా గ్రామం పక్కనే ఉండవల్లి గ్రామం ఉండటంతో ఇక్కడి నుంచి అక్కడికి వాకింగ్ నిమిత్తం వెళ్ళొస్తూ ఉంటాం.. అలాగే పంట పొలాల్లో కూలీ పనుల కోసం కూలీలు వెళ్తుంటారు.. మా గ్రామంలో కూడా వీధి దీపాలు సక్రమంగా వెలగటం లేదు..అధికారులు దయంచి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.. పెనుమాక గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిశ నిందితుల డెడ్ బాడీలను ఖననం చేయలేదు.. ఎందుకని?