Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స‌దుపాయాల్లేవ్, అయినా కోవిడ్‌ని ఎదుర్కొన్నాం: ప్రధాని మోదీతో జ‌గ‌న్-Video

Advertiesment
No facilities
, శుక్రవారం, 16 జులై 2021 (19:08 IST)
ఏపీ రెండుగా విడిపోయింది...న‌వ రాష్ట్రానికి హైద‌రాబాద్, బెంగుళూరు, చెన్న‌య్ వంటి పెద్ద న‌గ‌రాలు లేవు. ఇక్క‌డ స‌రైన వైద్య స‌దుపాయాలు లేవు...అయినా కోవిడ్ ని స‌మ‌ర్ధంగా ఎదుర్కొన్నామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి వివ‌రించారు.
 
కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం వైయస్‌.జగన్‌, కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి ప్ర‌ధానికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో కొత్త‌గా ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయ‌ని, ఇప్పటి వరకూ 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశామ‌ని జ‌గ‌న్ తెలిపారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, ఫోకస్‌గా టెస్టులు చేశాం. దీనివల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగాం.

ఇక వ్యాక్సినేషన్‌ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారమ‌ని జ‌గ‌న్ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ డోసులు 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి వచ్చాయ‌ని, వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చామ‌ని సీఎం వివ‌రించారు. జులై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించార‌ని, జులై నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించార‌ని ఆరోపించారు.
webdunia

కాని, క్షేత్ర స్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. జూన్ నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేన‌ని, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నామ‌న్నారు. కోవిడ్ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతాం అని సీఎం జగన్‌ తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనిజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరోసారి పెరిగిన బంగారం ధర - రూ.250 పెరుగుదల