తెలంగాణ: నిద్రిస్తున్న 9నెలల పాపను ఎత్తుకెళ్లాడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు..

బుధవారం, 19 జూన్ 2019 (10:43 IST)
తెలంగాణలో ఘోరం జరిగిపోయింది. హాయిగా నిద్రపోతున్న తొమ్మిది నెలల చిన్నారిని ఓ మానవ రూపంలోని రాక్షసుడు ఎత్తుకెళ్లాడు. ఇంకా అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడటంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్పృహ తప్పింది.


అంతే ఆ పాప చనిపోయిందని.. అక్కడ నుంచి పారిపోయాడు. బాలిక కనిపించకపోవడంతో ఈ ప్రాంతమంతా గాలించిన కుటుంబ సభ్యులు, బంధువులు బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలోని కుమార్ పల్లిలో పాప తన తల్లిదండ్రులతో కలిసి ఇంటిపై నిద్రిస్తోంది. ఈ క్రమంలో పక్క కాలనీలో నివాసం ఉంటే ప్రవీణ్ ఉదయాన్నే పాప నిద్రపోతుండగా ఆమెను ఎత్తుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై పాప చనిపోయిందనుకుని పారిపోయాడు.
 
కానీ పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘటనలో తమ ఒక్కగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రూ.1299కే విమాన టిక్కెట్ : మాన్‌సూన్ సేల్ పేరుతో విస్తారా ఆఫర్