Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూ ఇయ‌ర్ డే రూల్స్.... ఆరు బ‌య‌ట వేడుక‌ల‌కు అనుమ‌తుల్లేవ్!

న్యూ ఇయ‌ర్ డే రూల్స్.... ఆరు బ‌య‌ట వేడుక‌ల‌కు అనుమ‌తుల్లేవ్!
విజ‌య‌వాడ‌ , గురువారం, 30 డిశెంబరు 2021 (17:27 IST)
విజయవాడ నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా 2022వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, కొన్ని రూల్స్ పాటించాల‌ని విజ్న‌ప్తి చేశారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ, డిసెంబర్ 31న రాత్రి నిర్వహించుకునే వేడుకలకు కరోనా మహమ్మారి శ‌త్రువుగా మారింద‌న్నారు. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కొత్త వైర‌స్ ఓమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని, ఇటువంటి పరిస్థితులలో ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా పాటించాల‌న్నారు. 
 
 
అర్ధరాత్రి ఆరుబయట వేడుకలకు అనుమతులు లేవు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ మరియు సెక్షన్ 144 సి.ఆర్.పి.సి. అమలులో ఉన్నందున భహిరంగ ప్రదేశాలలో ఐదుగురు అంతకన్నా ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడటం నిషేధం. క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలు నిర్వహించుకోడానికి ముందస్తు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. నిర్వాహకులు సామాజిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సీటింగ్ కెపాసిటీలో 60 శాతం వరకు మాత్రమే అనుమతించేటట్లు నిబంధనలు పాటించాలి. ఆరు బయట ప్రదేశాలలో డి.జె. లు, ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టంను వినియోగించరాదు.
 
 
మద్యం సేవించి రోడ్లపై వాహనములు నడుపరాదు, అలా చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రధాన రహదారులైన బందరు రోడ్, ఏలూరు రోడ్, బి.ఆర్.టి.ఎస్. రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే విధంగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్, పి.సి.ఆర్. ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ అనుమతించరు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదు.
 
 
డిసెంబర్ 31వ తేదీన రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగ రాదు. జనవరి 1న నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలుపుకునేటప్పుడు మాస్కులు, శానిటైజర్లు వాడుతూ నిబంధనలు పాటించాలి. హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి నగరంలో పోలీస్ గస్తీ ముమ్మరంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీకి పాలనపై మంచి పట్టు - కాక రేపుతున్న పవార్ వ్యాఖ్యలు