కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఉదయం 6గంటల నుండి 11గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించేలా నిబంధనలు అమలు చేస్తున్నారు.
తాజాగా ఈ నిబంధనలను సడలించి వ్యాపారులకు ఊరట కల్పించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం నూతన సమయాలను మంగళగిరి మున్సిపల్ కమీషనర్ హేమమాలినీరెడ్డి బుధవారం తెలియజేశారు.
ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు దుకాణాలు ఉదయం 6నుండి సాయంత్రం 6గంటల వరకు, హోల్ సేల్ దుకాణాలు ఉదయం 6గంటల నుండి ఉదయం 11గంటల వరకు, రిటైల్ దుకాణాలు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు తెరుచుకోవచ్చునని ఆమె స్పష్టం చేశారు.
రేపటి నుంచి తాజా నిబంధనలు అమలవుతాయని అన్నారు.నిబంధనల ప్రకారమే వ్యాపార సంస్థలు నిర్వహించుకోవాలని, మాస్కుల వాడకం భౌతిక దోయిరాం తప్పని సరి అని నిబంధనలను అత్రిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.