Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిత్లీ బాధితులకి నాట్స్ సేవలు ప్రశంసనీయం... చంద్రబాబు

Advertiesment
తిత్లీ బాధితులకి నాట్స్ సేవలు ప్రశంసనీయం... చంద్రబాబు
, శుక్రవారం, 19 అక్టోబరు 2018 (21:51 IST)
శ్రీకాకుళం జిల్లా తిత్లీ బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సంకల్పించింది. నాట్స్ సంస్థ పలాస, సోంపేట ప్రాంతాలకు 50 మందికి పైగా నాట్స్ వాలంటీర్లను పంపించింది. స్థానిక గ్లో పౌండేషన్ నాట్స్‌కు తన సహాయ సహకారాలు అందిస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారు NATS సంస్థ సేవలను కొనియాడారు. చీరలు, దుప్పట్లు, బియ్యం, కందిపప్పు మొదలగు సరకులతో కూడిన నాట్స్ కిట్స్ చంద్రబాబు నాయుడు తుఫాను బాధితులకి అందించారు.
 
దత్తత గ్రామానికి సాయం చేస్తున్న NATS మరియు GLOW స్వచ్చంద సేవాసంస్థలు తిత్లీ తుఫాన్‌తో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుటున్న తమ దత్తత గ్రామం మందస మండలం కొండలోగం పంచాయతీ అనుబంధ గ్రామాల్లో (కొండలోగం, పట్టులోగం, తంగారపుట్టి, దాలకాయి, తెంతులగాం, లింబుగం, రాయికొల, కుసుమాల, తుబ్బిగాం, బాంసుగామ్, రామరాయి) వారికి అవసరమగు చీరలు, దుప్పట్లు, బియ్యం, కందిపప్పు మొదలగు సరకులతో కిట్స్ తయారుచేసి 10,000 తుఫాను బాధితులకి అందించారు. 
 
భోజనం ఏర్పాట్లు పర్యవేక్షించి సత్వర కార్యక్రమాలతో ఆదుకున్నారు. ఈ గ్రామంలో NATS సంస్థ గతంలో నిర్మించిన సామాజిక భవనం తిత్లీ తుఫాన్ సమయమందు ఎందరినో అందుకుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు NATS అండ్ GLOW స్వచ్చంద సేవాసంస్థలకు ధన్యవాదాలు తెలియజేసారు. నారా చంద్రబాబు నాయుడు NATS సంస్థ సేవలను కొనియాడుతూ, పలాసలో దసరా ఉత్సవాలు సందర్భంగా NATS సంస్థ వారిని పిలిపించుకొని వారితో సేవాకార్యక్రమాల వివరాలు తెలుసుకొని అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రావణ దహనంలో పెను విషాదం... రైలు ఢీకొట్టి 50 మందికి పైగా దుర్మరణం(Video)