Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే దేశం మూడవస్థానం : మోడీ

2030 సంవత్సరం నాటికి శాస్త్రసాంకేతిక రంగంలో ప్రపంచంలోనే భారతదేశం మూడో స్థానాన్ని సంపాదించుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తిరుపతిలో 104వ ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోడీ శాస్త్రవే

Advertiesment
2030 నాటికి శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే దేశం మూడవస్థానం : మోడీ
, మంగళవారం, 3 జనవరి 2017 (14:09 IST)
2030 సంవత్సరం నాటికి శాస్త్రసాంకేతిక రంగంలో ప్రపంచంలోనే భారతదేశం మూడో స్థానాన్ని సంపాదించుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తిరుపతిలో 104వ ఇండియన్‌ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించిన మోడీ శాస్త్రవేత్తలు, విద్యార్థులను ఉద్దేశించి సుధీర్ఘంగా ప్రసంగించారు. సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 
 
శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్ధ్యాలను దేశం గౌరవిస్తోందన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనాశాలల నిర్వహణ సులభతరం కావాలన్నారు. పర్యావరణ సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. 
 
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, 12 కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైబర్‌, రోబోటిక్స్ రంగాల్లో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, పర్యావరణం, నీటిశుద్ధి రంగాలు ఎంతో కీలకంగా మారనున్నాయని, వాతావరణ మార్పులు, హాని చేసే సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
డిజిటల్‌ భారత్‌ ద్వారా ఉత్పత్తిరంగ అభివృద్ధికి కృషి జరుగుతోందని, ఆయా రంగాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, వ్యవసాయం, విద్యా, సాంకేతిక, మౌలికవసతుల కల్పనకు ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని కొత్త ఆవిష్కరణలు మన శాస్త్రవేత్తలు నాంది పలకాలని ఆయన కోరారు. 
 
సమాజ సాధికారతకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు దేశం కృతజ్ఞతగా ఉంటుంది. వివిధ అంశాల్లో శాస్త్ర పరిశోదనలకు మద్దతుగా మా ప్రభుత్వం ఉంటుందని, దేశ శాస్త్ర సాంకేతిక విధానాలు వికసించేలా పాఠశాల స్థాయి విద్యార్థులకు ఆలోచనలు మదింపు జరగాలి ఎన్‌ఆర్‌ఐ పిహెచ్‌డి విద్యార్థులసేవలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్టార్టప్స్ పరిశ్రమలకు తగ్గట్టుగా టెక్నాలజీ ఉండాలని, డిజిటల్‌ ఇండియా ద్వారా  ఉత్పత్తి రంగ అభివృద్ధికి కృషి జరుగుతోంది. వర్సిటీలు, ఐఐటీలు, స్టార్టప్‌‌లు, మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచెయ్యాలని మోడీ అన్నారు. 
 
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్‌ సమావేశాలు జరగడం అదృష్టమని, ఆర్థిక సంస్కరణలో రెండు అతిపెద్ద నిర్ణయాలు ప్రధాని తీసుకున్నారని, నోట్ల రద్దు, జిఎస్‌టిపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఆవిష్కరణలకు మన శాస్త్రవేత్తలు స్వాగతం పలుకుతున్నారు. 
 
ప్రస్తుతం దేశమంతా సాంకేతికరంగంలో దూసుకెళుతోంది. శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. శాస్త్ర సాంకేతిక విజయాలు సామాన్య ప్రజలకూ చేకూరుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపే చూస్తున్నాయి. ప్రతి వ్యక్తి తన జీవితంలో తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులే ఉంటున్నారు. ప్రస్తుతం దేశమంతా సాంకేతిక రంగంలో దూసుకెళుతోందని, చరవాణీల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తున్నామన్నారు. 
 
ఏపీలో ఇప్పటికే 25 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. మార్చి ఆఖరికి 50 శాతం నగదు రహిత లావాదేవీలు జరుగుతాయని చెప్పారు. బయోమెట్రిక్‌ పద్ధతిలో చౌకదుకాణాల నుంచి వస్తువులను అందిస్తున్నాం. నెలకు 149కే ఫైబర్ గ్రిడ్‌ సేవలను అందిస్తున్నాం. ఎల్‌ఇడీ విధి దీపాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నలుగురు యువతులపై ప్రేమ పేరుతో అత్యాచారం.. భారీగా డబ్బులు గుంజుకుని వదిలేశాడు..