నలుగురు యువతులపై ప్రేమ పేరుతో అత్యాచారం.. భారీగా డబ్బులు గుంజుకుని వదిలేశాడు..
ప్రేమ పేరుతో వంచించిన ఓ యువకుడి బండారం బయటపడింది. ప్రేమ పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారానికి పాల్పడి.. బాగా డబ్బులు గుంజుకున్న యువకుడిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. పుణేకు చెందిన
ప్రేమ పేరుతో వంచించిన ఓ యువకుడి బండారం బయటపడింది. ప్రేమ పెళ్లి పేరుతో యువతిపై అత్యాచారానికి పాల్పడి.. బాగా డబ్బులు గుంజుకున్న యువకుడిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. పుణేకు చెందిన అమిత్ అనే వ్యక్తి తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటూ వివాహ సంబంధాల వెబ్ సైట్లో ప్రకటన ఇచ్చాడు. దీంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి అతడిని సంప్రదించింది.
ఈ సంప్రదింపులు కాస్త ప్రేమగా మారింది. ఫోన్లు.. షికార్లు అంటూ సాగిన వీరి ప్రేమాయణానికి అమిత్ ముగింపు పలకాలనుకున్నాడు. అంతే ఓ రోజు ఉన్నట్టుండి ఆమెకు ఫోన్ చేసి తాను రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్తున్నానని.. ఈ లోపు నిశ్చితార్థం చేసుకుందామని చెప్పాడు. నిశ్చితార్థం కోసం చర్చించాలని సదరు యువతిని తన ఫ్లాటుకు రమ్మన్నాడు. ఆపై ఆమెను లోబరుచుకుని అనేకమార్లు అత్యాచారం చేశాడు. వీసా కోసమంటూ డబ్బులు కూడా తీసుకున్నాడు.
రెండు నెలల తర్వాత తమ మధ్య ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నానని ఆ యువతితో అమిత్ చెప్పాడు. దీంతో తానిచ్చిన డబ్బులు తిరిగివ్వమని బాధితురాలు కోరగా, నో చెప్పాడు. అంతే ఇక తాను మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అమిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఇదేవిధంగా మరో నలుగురు యువతులపై అత్యాచారం జరిపి, మోసం చేసినట్టు అమిత్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.