Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెట్ ఫ్లిక్స్‌లో కొత్త సిరీస్ వచ్చింది.. పేరు "బ్యాండేజ్ బబ్లూ" : నారా లోకేశ్ సెటైర్లు

nara lokesh

ఠాగూర్

, బుధవారం, 1 మే 2024 (10:51 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆయన ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాట్లాడుతూ, ఇటీవలివరకు సీఎం జగన్ నుదుటన బ్యాండేజితో తిరిగారన్నారు. నెట్ ఫ్లిక్స్‌లో కొత్త సిరీస్ వచ్చింది దాని పేరు 'బ్యాండేజ్ బబ్లూ'. యాక్టర్ ఎవరో తెలుసా జగన్ మోహన్ రెడ్డిగారు. నిర్మాత ఎవరో తెలుసా.. భారతీ రెడ్డిగారు. డైరెక్షన్ మొత్తం ఐప్యాక్ టీమ్. ఇప్పటికే భాస్కర్ అవార్డులు వచ్చేశాయి.. త్వరలోనే ఆస్కార్ అవార్డు కూడా ఖాయం అంటూ ఎద్దేవా చేశారు. 
 
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిలా మాయమాటలు చెప్పబోమని, రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగిని ఆదుకునేలా తమ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన చెప్పారు. 
 
మణిపూర్ అల్లర్లలో మహిళలపై అత్యాచారాలకు పోలీసులే కారణం : సీబీఐ చార్జిషీటు 
 
ఈశాన్య రాష్ట్రమై మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లలో మహిళలపై అత్యాచారాలకు పోలీసులే కారణమని సీబీఐ సంచలన నివేదిక ఇచ్చింది. బాధిత మహిలలను పోలీసులే స్వయంగా నిందితుల వద్ద వదిలిపెట్టారని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. మణిపూర్ రాష్ట్రంలో గత యేడాది మే 4వ తేదీన కుకీ, మెయితీ తెగలకు చెందిన ప్రజల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గతేడాది అక్టోబరులోనే సీబీఐ చార్జి షీటు దాఖలు చేసింది. ఇందులో ఓ మైనర్ సహా ఆరుగురు నిందితులను ప్రస్తావించింది. ఈ చార్జీషీటులోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
 
చార్జిషీట్ వివరాల ప్రకారం, తమ గ్రామంపై జనాలు పలు బృందాలుగా విడిపోయి దాడి చేయడం ప్రారంభించగానే ముగ్గురు మహిళలు తమ కుటుంబాలతో కలిసి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. కానీ, గ్రామంపై దాడి చేస్తున్న మూక వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చింది. ఈలోపు గుంపులోని కొందరు బాధితులకు పోలీసులను ఆశ్రయించమని సూచించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు మరో పురుషుడు సమీపంలోని పోలీసు జీపు వద్దకు వెళ్లి అందులోని ఇద్దరు పోలీసుల సాయం అర్థించారు. 
 
కానీ, పోలీసులు వారిని తీసుకెళ్లి దాడిచేస్తున్న గుంపు ముందు దిగబెట్టారు. ఈ క్రమంలో ఆ దుండగులు ఇద్దరు మహిళలతో పాటు ఉన్న పురుషుడిని చంపేశారు. దుండగుల దృష్టి ఇద్దరు మహిళపై ఉండగా మరో మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. మరోవైపు, తమకు చిక్కిన ఇద్దరు మహిళలను.. దుండగులు నగ్నంగా ఊరేగించి చివరకు గ్యాంగ్ రేప్ చేశారు.
 
ఈ దాడి మొత్తం ముందస్తు ప్రణాళికతో చేసిందని సీబీఐ పేర్కొంది. ఓ మైనర్ సహా మొత్తం ఏడుగురిపై కేసు ఫైల్ చేసింది. వీరు.. మరో భారీ గుంపుతో కలిసి ఈ దాడి చేశారని వెల్లడించింది. నిందితులపై గ్యాంగ్ రేప్, హత్య, మహిళలను అగౌరవపరచడం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు సీబీఐ తన చార్జి షీటులో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజు రోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్