తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా వుండాలని పేర్కొంది. సగటు ఉష్ణోగ్రత 41, 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అంచనా.
నగర ప్రజలు ఇప్పటికే వేడి తీవ్రత కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నారు. జియాగూడలో మంగళవారం 43.2 డిగ్రీల సెల్సియస్, రెయిన్ బజార్ వద్ద 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. లంగర్ హౌజ్, మాదాపూర్‌లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి,
ఒక్కోటి 43 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. అయితే మే మూడో వారంలో వర్షాలు కురిసే అవకాశంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ-హైదరాబాద్ అధికారులు అంచనా వేస్తున్నారు.