వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో పలు పోస్టులు పెట్టారు. వినేవాళ్లు అమాయకులైతే చెప్పేవారు జగన్ అన్నట్టుంది పరిస్థితి అంటూ సెటైర్ వేశారు.
అంతేకాకుండా, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నిధులు లేవని దొంగ ఏడుపులు ఏడుస్తున్న జగన్... వైకాపా కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి రూ.233 కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అని నిలదీశారు.
గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైకాపా కార్యకర్తల కోసం ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్‌లో రూ.83 కోట్లు ఆదా అంటూ చెవిలో జగన్ క్యాబేజీ పెట్టారు. వైకాపా ప్రభుత్వం టెండర్లు పిలిస్తే, రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ వేసింది. ఈ స్కీంలో రూ.233 కోట్ల ప్రజాధనానికి జగన్ టెండర్ పెట్టడం తప్ప రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉంది?.
ఇకపోతే జగన్ పారదర్శకత ప్రకారం రూ.100 కోట్లు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాలి. మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు పంపలేదే? అంటే జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా జగన్? అంటూ తన ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు.