Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

నేను బయటపెట్టే నిజాలు చూసి నాని వణికిపోతాడు... బాంబు పేల్చిన శ్రీరెడ్డి(Video)

నటుడు నానిని శ్రీరెడ్డి తన వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవాలు సంగతి ఎలా వున్నా... నానిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యల పరంపర సాగుతోంది. తాజాగా ఆమె మరో బాంబు పేల్చింది. తను త్వరలో బయటపెట్టే నిజాలను చూసి నాని వణికిపోతాడంటూ వ్యాఖ్యానించింది. ప్ర

Advertiesment
Nani
, గురువారం, 14 జూన్ 2018 (12:10 IST)
నటుడు నానిని శ్రీరెడ్డి తన వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవాలు సంగతి ఎలా వున్నా... నానిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యల పరంపర సాగుతోంది. తాజాగా ఆమె మరో బాంబు పేల్చింది. తను త్వరలో బయటపెట్టే నిజాలను చూసి నాని వణికిపోతాడంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కేరళలో వున్న శ్రీరెడ్డి అక్కడ నుంచి ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడింది. 
 
మరోవైపు క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై సరైందేనని కొందరు అంటున్నా.. మరికొందరు మాత్రం శ్రీరెడ్డి పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తుందని కొట్టిపారేస్తున్నారు. నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి నానిని లక్ష్యంగా చేసుకుని.. విమర్శలు గుప్పించింది. అయితే శ్రీరెడ్డి విమర్శలపై నాని సీరియస్ అయ్యాడు.
 
శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపించాడు. ఇందుకు శ్రీరెడ్డి కూడా చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇంతలో నాని భార్య అంజనా కూడా సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై మండిపడింది. కొందరు పబ్లిసిటీ కోసం చేస్తున్న వ్యవహారాన్ని ఎవ్వరూ నమ్మరని.. పబ్లిసిటీ కోసం ఇతరుల జీవితాలతో కొందరు చెలగాటం ఆడుతున్నారని శ్రీరెడ్డిపై ఫైర్ అయ్యింది. 
 
ఈ వ్యవహారంపై దక్షిణాది నటుడు విశాల్ స్పందించాడు. వ్యక్తిగత కారణాల రీత్యా నానికి మద్దతు పలకట్లేదని.. నానిపై శ్రీరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నాడు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒప్పుకుంటాను. కానీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేయడం సరైందని కాదని విశాల్ హితవు పలికాడు. మహిళల పట్ల నాని ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో అతని గురించి తెలిసిన వారందరికీ బాగా తెలుసునని స్పష్టం చేశాడు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే ఆధారాలు చూపించాలి. 
 
కేవలం, వారి పేర్లు బయటపెడితే సరిపోదని.. శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఇతరులపై తన ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తోందని అర్థమవుతోంది. భవిష్యత్‌లో తనను కూడా శ్రీరెడ్డి టార్గెట్ చేస్తుందేమోనని విశాల్ తెలిపాడు. ఆడిషన్ పేరిట అమ్మాయిలను మోసం చేయడం తప్పు. మన దేశంలో లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించి సరైన చట్టాల్లేవన్నాడు. వీడియో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పులు ఎగ్గొట్టడానికి చచ్చినట్టుగా నాటకం... ఎక్కడ?