Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వారు బాబుగారి పసుపు మహిళలు, దళితులు కాదు

Advertiesment
వారు బాబుగారి పసుపు మహిళలు, దళితులు కాదు
, సోమవారం, 9 ఆగస్టు 2021 (21:07 IST)
అమరావతి అనే బినామీ ఉద్యమానికి చంద్ర‌బాబు దళితుల రంగు పులుముతున్నార‌ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. తాడేపల్లి- వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అమరావతి ఉద్యమం చేస్తోంది బాబు ఆత్మ బంధువులేన‌ని, వారు "పసుపు మహిళలుష‌... బాబు ఆత్మ బంధువులే కాని దళితులు కాద‌న్నారు.

చంద్రబాబు ఇక్కడ ఉండడం లేదు కానీ, ఆయన మనసంతా అమరావతి భూముల మీదే ఉద‌న్నారు. దళితుల ప్రయోజనాన్ని అణగదొక్కిన వారే ఉద్యమం పేరుతో రోడ్లకెక్కార‌ని, దళితులను అణగదొక్కడంలో చంద్రబాబుది  ప్రత్యక్ష పాత్ర అయితే.. పరోక్ష పాత్ర ఈనాడు, ఏబీఎన్, టీవీ5లది అని చెప్పారు.
 
దమనకాండ అంటే.. బషీర్‌బాగ్‌లో మాదిరి రైతుల గుండెలపై తుపాకులు పేల్చి చంపేయడం, గుఱ్ఱపు డెక్కలతో తొక్కించడం... ఇక అమ‌రావ‌తిలో జ‌రిగేది అది ఉద్యమం కాదు.. ఆస్తుల ధరలు కాపాడుకోవటం కోసం ఉన్మాదుల్లా తయారైన బాబు బినామీలు చేసే రియల్ ఎస్టేట్ ఉద్యమం అని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలో బాబు చేసిన అభివృద్ధి ఎక్కడ.. ధ్వంసమైంది ఎక్కడో చెబితే బాగుండేద‌ని, అమరావతి దీక్షల్లో మామూలు రోజుల్లో ఒక్కరూ కనిపించరు.. ఉద్యమం పండుగలప్పుడే కనిపిస్తార‌ని ఎద్దేవా చేశారు.
 
దళితుల్లో ఎవరు పుట్టాలని అనుకుంటార‌ని మాట్లాడి, ఈ రోజుకీ ఆ మాటకే కట్టుబడ్డ బాబుకు దళితుల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు. అమరావతి అనే బినామీ ఉద్యమానికి ఇప్పుడు చంద్రబాబు కొత్తగా దళితుల రంగు వేయాలని ప్రయత్నిస్తున్నాడని నందిగం సురేష్ ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం అంటూ వచ్చిన పసుపు మహిళల సామాజికవర్గం ఏమిటో అందరికీ తెలుసునని, పట్టుమని పది మంది కూడా లేని ఆ గ్రూపులో ప్రతి ఒక్కరు మిలియనీర్లు, బాబు బినామీలే అని  వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గిఫ్ట్ ఏ స్మైల్‌కు యాంక‌ర్ ప్ర‌దీప్ విత‌ర‌ణ‌