Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైలవరంలో వైసీపీ వార్... సర్పంచులనూ తాకబోతోందా?

Advertiesment
మైలవరంలో వైసీపీ వార్... సర్పంచులనూ తాకబోతోందా?
విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (12:53 IST)
కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల తరువాత మైలవరం నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. హోరాహోరీగా జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అని పోరాడింది. ఇద్ద‌రికీ స‌మానంగా వార్డులు రావ‌డం, ఇండిపెండెంట్ తెలుగుదేశం పంచ‌న చేర‌డంతో ఛైర్మ‌న్ ఎన్నిక వివాదం అయింది. అన్ని చోట్లా విజ‌య‌ఢంకా మోగించిన అధికార వైసీపీకి ఇక్క‌డ ఈ దుస్థితి రావ‌డానికి కార‌ణం పార్టీలోని అంత‌ర్గ‌త లుక‌లుక‌లే అని స్థానికులు పేర్కొంటున్నారు. ఇపుడు అవి పెరిగి, చివరికి గ్రామాల స‌ర్పంచుల‌కు తాకుతోంద‌ని తెలుస్తోంది.
 
 
మైలవరం మండలంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేరువేరుగా హాజరయ్యారు. మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పామర్తి శ్రీనివాసరావు , నాగిరెడ్డి లాంటి పార్టీ సీనియర్ నాయకులు మరికొంత మంది ఎమ్మెల్యే జోగి రమేష్ తో కలిసి హాజరవగా, మైలవరం మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఆశిస్తున్నవారు మరి కొందరు వసంత కృష్ణ ప్రసాదుతో కలిసి హాజరయ్యారు. హాజరయిన ఫంక్షన్ ఫోటోలు ఎవరి తరుఫున వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో నియోజకవర్గ ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. 
 
 
ప్రతిపక్ష ట‌డీపీని ఇరకాటంలో పడెయ్యాలని యత్నించిన అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాల వలన తీవ్ర స్థాయిలో రాజకీయ సంక్షోభంలోకి వెళ్లినట్లయింది. అబ్బే మా పార్టీ లో ఏమీ జరగలేదు. మీడియా చిలువలు పలువలుగా రాతలు రాస్తుంది అన్న వాళ్ల నోళ్లు మూతపడ్డాయి. 
 
 
దీంతో ఇప్పుడు మైలవరం నియోజకవర్గం లో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నచందంగా మారింది పరిస్థితి, ఒకరేమో 2011 నుండి మైలవరం నియోజకవర్గం లో వైఎస్సార్ సీపీ కి పునాదులు వేసి పార్టీ ని బలోపేతానికి కృషి చేసిన వారు కావడం, మరొకరేమో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి పార్టీ అభివృద్ధి కి, ఆయా గ్రామాల లో అభివృద్ధి పనులను చేసిన వారు కావడం వలన కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
 
 
ఏదేమైనా కొండపల్లి మునిసిపాలిటీ ఎన్నికల తరువాత వైఎస్సార్ సీపీ రాజకీయ సంక్షోభం లోకి వెళ్లిన కారణంగా మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ వైఎస్సార్ సీపీ కి రాజీనామా కూడా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు - ప్రమాదస్థలిలో ఎయిర్ చీఫ్