Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదే నిజమైతే జగన్ బయట తిరిగేవారా? కంటే కూతుర్నే కనాలి : ఆర్ఆర్ఆర్

Advertiesment
raghuramakrishnamraju
, గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:21 IST)
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. సీబీఐ - చంద్రబాబు నాయుడు కుమ్మక్కైతే 35కి పైగా అవినీతి కేసుల్లో చిక్కుకుని బెయిల్‌పై తిరుగుతున్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతారా? కోర్టుకు వెల్లకుండా ఉండేవారా? అని అడిగారు. 
 
ఇకపోతే ఈ నెల 25వ తేదీ వరకు వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ సీబీఐను తెలంగాణ హైకోర్టు ఆదేశించడాన్ని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సుప్రంకోర్టును ఆశ్రయించడం స్వాగతించదగిన విషయమన్నారు. కంటే కూతురునే కనాలి అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పుపై ఇదేమి తీర్పు అని ప్రజలు అనుకుంటున్నారని, కానీ, న్యాయస్థానాలపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు. అదేసమయంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని అవినాష్ రెడ్డి ఊహించకపోయి ఉండొచ్చని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా