కుటుంబ కలహాలతో ఒక యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. టీవి చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్ ఓపెన్ చేసి నిప్పటించుకుంది.
తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో డిగ్రీ చదువుతోంది గాయత్రి. కళాశాలలు మూతపడి ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టివీ ఎక్కువగా చూస్తూ ఉండేది. ఆన్ లైన్ క్లాస్‌లను కూడా చూడకుండా టివీకి అతుక్కుని పోవడంతో తల్లిదండ్రులు మందలించారు.
చదువుకోమని మందలించారు. గత వారంరోజుల నుంచి ఇంట్లో తల్లిదండ్రులతో ఇదే స్థాయిలో గొడవ జరుగుతోంది. దీంతో మనస్థాపానికి గురైన గాయత్రి తల్లిదండ్రులు పని మీద బయటకు ఈరోజు మధ్యాహ్నం వెళ్ళారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకుంది గాయత్రి. దాంతో అక్కడికక్కడే సజీవ దహనమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. గాయత్రి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.