Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జంపింగ్ ఎమ్మెల్యేలపై డైలాగ్ కింగ్ ఏమన్నారు..? నీచ నికృష్టమైన... అసెంబ్లీ రౌడీలో?

Advertiesment
Mohanbabu Shocking Comments on Jumping MLAs
, ఆదివారం, 5 జూన్ 2016 (15:20 IST)
పిల్లి మీద గోడలా ఒక పార్టీ నుంచి వేరొక పార్టీకి జంప్ అయ్యే ఎమ్మెల్యేలపై డైలాగ్ కింగ్ - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో జంపింగ్ నేతలపై మోహన్ బాబు మండిపడ్డారు. తెలంగాణాలో టిఆర్ఎస్, ఏపీలో టీడీపీ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడంపై మోహన్ బాబు తనదైన శైలిలో ఏకిపారేశారు. 
 
దీనిపై మోహన్ బాబు మాట్లాడుతూ.. ఇవాళ ఒక పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇంకో పార్టీలోకి వెళ్లిపోవడం వంటి నీచ నికృష్టమైన విషయాలను అప్పట్లోనే ‘అసెంబ్లీ రౌడీ’లో చూపించాం.. అన్నారు. ఇంతకీ ఈ టాక్ మోహన్ బాబు నోట ఎందుకు వచ్చిందంటే.. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం విడుదలై శనివారంతో పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకుడు బి. గోపాల్, రచయిత పరుచూరి గోపాలకృష్ణతో కలిసి 'అసెంబ్లీ రౌడీ' హీరో మోహన్ బాబు మీడియాతో మాట్లాడటంతోనే. సో.. పార్టీ మారే జంపింగ్ జపాంగ్స్‌కు మోహన్ బాబు చెప్పిన డైలాగ్‌ గుర్తుంటుందో లేదో..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరునెలల పాపతో పాటు 17 మంది మృతి!