Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరునెలల పాపతో పాటు 17 మంది మృతి!

ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరునెలల పాపతో పాటు 17 మంది మృతి!
, ఆదివారం, 5 జూన్ 2016 (14:54 IST)
ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం ఉదయం చోటుచేసుకున్న భారీ రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వేగంగా దూసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి రెండు కార్లను ఢీకొని 20 అడుగుల లోతు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
 
ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హైవేలో నిలుచుని పంక్చర్ అయిన ఇనోవా కారుకు డ్రైవర్ టైర్ మారుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. లగ్జరీ బస్సు సతారా నుంచి వస్తుండగా నిలుచున్న ఇనోవా కారును ఢీకొనడంతో పాటు 20 అడుగుల కిందకు పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరునెలల పాపతో పాటు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్ బుక్‌లో ఇక మెసెంజర్ ఉండదా? మొబైల్ వెబ్ అప్లికేషన్ డిసేబుల్ కానుందా?