Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోహన్ బాబుకి ఆ అనుమతి ఇవ్వకుంటే రచ్చరచ్చ అవుతుందని ఇచ్చారా?

Advertiesment
Mohan Babu
, శుక్రవారం, 21 జనవరి 2022 (16:53 IST)
ఒకరేమో కలెక్షన్ కింగ్. మరొకరేమో ముఖ్యమంత్రి. ఇద్దరూ వేరే వేరే రంగాల్లో ఉన్నా వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రితోనే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు మంచు ఫ్యామిలీ. మొదట్లో చంద్రబాబునాయుడును మెచ్చుకున్న మోహన్ బాబు ఆ తరువాత పూర్తిగా వ్యతిరేకించారు. 

 
స్వతహాగా రాజకీయాలకు దూరంగా ఉండే మోహన్ బాబు ఏదో ఒక పార్టీకి సానుభూతిపరుడిగా ఉంటూ మిగిలిన వారిని తిడుతూ ఉంటారు. విద్యాసంస్థల అధినేతగా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీని స్థాపించేందుకు సిద్థమయ్యారు. 

 
ఈ విషయాన్ని స్వయంగా మోహన్ బాబే కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. యూనివర్సిటీ స్థాపించడం చిరకాల స్వప్నం. అది ఇప్పటికీ నెరవేరినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతులు రావాలంటే ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. 

 
ఆ అనుమతులు అన్నీ రావడానికి బాగా సమయం పడుతుంది. అది అంత సులభం మాత్రం కాదు. ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తరువాతనే యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రకటించుకోవాల్సి ఉంటుంది. కానీ మోహన్ బాబు యూనివర్సిటీ స్థాపిస్తున్నట్లు నేరుగా ప్రకటించేశారు.

 
అయితే ఐదు రోజుల వరకు యూనివర్సిటీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు విడుదల కాలేదు. గత రెండురోజుల క్రితమే మోహన్ బాబు యూనివర్సిటీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇది కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. 

 
మోహన్ బాబు కోసం ఏకంగా చట్టసవరణ చేసింది ప్రభుత్వం. మోహన్ బాబు ధరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీకి పదో యూనివర్సిటీగా జాబితాలో ఉంచింది. మోహన్ బాబుకే అనుమతి ఇవ్వకుంటే రచ్చ రచ్చ అవుతుందని సిఎం ఈ నిర్ణయం తీసేసుకున్నారనే ప్రచారం బాగానే సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసినో, జూదం నిర్వహించామని నిరూపిస్తే రాజీనామా... ఆత్మహత్య