Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగుల ఐక్య పోరు - అత్యవసరంగా ఏపీ కేబినెట్ భేటీ

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 21 జనవరి 2022 (12:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఐక్యమై ఆందోళనకు దిగారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడితో హోరెత్తించారు. అలాగే, మరికొందరు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అదేసమయంలో నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు ఏకమై ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నట్టు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమవుతుంది. ఇందులో పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా, పీఆర్సీతోపాటు సినిమా టిక్కెట్ల అంశంపై మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. 
 
అలాగే, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ అధికమైపోతోంది. దీంతో కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, పాఠశాలలను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రావొచ్చని అధికారులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మధ్యాహ్న భోజనం.. మెనూలో ఇడ్లీ, సాంబార్