Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పొగలు...

Advertiesment
విశాఖ - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పొగలు...
, శుక్రవారం, 21 జనవరి 2022 (09:19 IST)
విశాఖపట్టణం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ (ఏపీ ఎక్స్‌ప్రెస్) రైలులో ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున సంభవించింది. దీంతో రైలును వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ఎస్-6 బోగీ నుంచి ఈ పొగలు వచ్చినట్టు గుర్తించారు. 
 
అయితే, రైలు బ్రేకులు జామ్ కావడం వల్లే పొగలు వచ్చాయని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. లోపాన్ని సరిచేస్తున్నామని, ఈ లోపాన్ని సరిచేసిన తర్వాత రైలు తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. కాగా, ఈ రైల్వే స్టేషన్‌లో రెండు గంటలకు పైగా ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైకోర్టుకు చేరిన ఏపీ ఉద్యోగుల పీఆర్సీ పంచాయతీ