Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్‌ఫోన్‌ పోగొట్టుకుంటే.. ఇక ఈజీగా పొందవచ్చు.. ఎలా?

Advertiesment
mobile phone
, శుక్రవారం, 26 ఆగస్టు 2022 (19:53 IST)
సెల్‌ఫోన్‌ పోతే, తిరిగి దక్కించుకోవడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను వెతికి పెట్టేందుకు అనంతపురం జిల్లా పోలీసులం 'చాట్ బాట్' పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చారు. 
 
సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లక్కర్లేకుండా, ఎఐఆర్ నమోదు చేయాల్సిన పని లేకుండా కేవలం వాట్సప్ మెసేజ్ చేస్తే చాలు.. పోగొట్టుకున్న ఫోనును రికవరీ చేసి, అందజేస్తారు. 
 
సెల్‌ఫోన్ పోగొట్టుకున్న, చోరీకి గురైనవారు ముందుగా 9440796812 అనే నెంబర్‌కు వాట్సప్‌లో ఆంగ్లంలో 'హాయ్' లేదా 'హెల్ప్' అని మెసేజ్ పంపాలి. వెంటనే 'వెల్కమ్ టు అనంతపురం పోలీస్' పేరున లింకు వస్తుంది. 
 
అందులో గూగుల్ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. దానిలో జిల్లా, పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, పోయిన ఫోన్ మోడల్, ఐఎంఈఐ నంబర్, మిస్సయిన ప్రాంతం తదితర వివరాలను నమోదు చేయాలి. 
 
వివరాలను నమోదు చేయగానే వెంటనే చాట్ బాట్ వ్యవస్థకు ఫిర్యాదు వెళ్తుంది. దీనిని పర్యవేక్షించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో 8 మందితో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోందని పోలీసులు తెలిపారు.
 
అయితే, ఈ చాట్ బాట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచీ ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనాలీ ఫోగట్‌కు సింథటిక్ డ్రగ్ : గోవా ఐడీ ఓంవీర్ సింగ్